NDL: బీజేపీ ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురంలో ఒక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావం, నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సోషల్ మీడియా వినియోగం, కృత్రిమ మేధస్సు (ఏఐ), యోగా వంటి కీలక అంశాలపై పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.