PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నుంచి తప్పుకోనుంది. పురపాలక సంఘం పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి వరకు ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.