SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి రాష్ట్ర మంత్రి లోకేష్‌ను ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి నిధులు కేటాయించి పునర్నిర్మాణం చేసే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.