TG: దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపైనే ఆధారపడి ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పరుగుగానే కాకుండా, ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవసరమని పేర్కొన్నారు.