హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. బాలసముద్రం శ్రీనివాస నగర్లోని కాళోజి కళాక్షేత్రం వెనుక వైపు హనుమాన్ టెంపుల్ సమీపంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.