కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పి.గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కార్యకర్తల డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు జగన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారని వెల్లడించారు.