SS: రొద్దం మండలంలోని చెరువులకు చేరుతున్న హంద్రీ–నీవా కాలువ జలాలను టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంకటరామరెడ్డి కాలువల్లో ప్రవహిస్తున్న నీటి పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. చెరువులకు నీరు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.