NTR: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకుప్రభుత్వం చేపట్టిన PGRS కార్యక్రమాన్ని నందిగామ RDO పోసి బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 వినతులు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ-7, సర్వే-3, మున్సిపాలిటీ -1, పోలీసు – 2, నీటి పారుదలపై 1 అర్జీ వచ్చిందన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని RDO పేర్కొన్నారు.