విజయనగరం: జనగణనలో భాగంగా స్వీయ గణన సౌకర్యం నేటి నుంచి ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్సైట్లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి OTP ద్వారా నమోదు చేసి, 34 ప్రశ్నలతో తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే రిఫరెన్స్ ఐడీని ఎన్యూమరేటరు ఇవ్వాలని తెలిపారు.