కృష్ణా: మాజీ కేంద్ర మంత్రి, పూర్వపు మచిలీపట్టణం ఎంపీ కావూరి సాంబశివరావుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని కావూరి స్వగృహంలో సాంబశివరావు పార్ధివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కావూరి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.