ASR: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లను వేస్తున్నామని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ స్నేహలత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని హెచ్వీ భూలోక, పలువురు ఏఎన్ఎంలతో కలిసి నిర్వహించారు. ఈమేరకు 11మంది బాలికలకు వ్యాక్సిన్లు వేశామన్నారు.