KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో పేదల అసైన్డ్, సాగు భూములను సోలార్ ప్రాజెక్టుకు కేటాయించడాన్ని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు జి. శివకుమార్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను లాక్కోవడం అన్యాయమని తెలిపారు. ప్రజాప్రతినిధులు కంపెనీలకు కాకుండా రైతుల పక్షాన నిలబడాలని ఆయన డిమాండ్ చేశారు.