కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి గ్రామ సచివాలయం పరిధిలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమం కొనసాగుతోందని పంచాయతీ సెక్రెటరీ అంకబాబు అన్నారు. గ్రామంలో AO శివరామకృష్ణ, ఎంపీడీవో త్రినాధ్ సమక్షంలో ఇంటి పన్నుల వసూళ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మొత్తం రూ.6,79,136 నగదు చెక్కుల రూపంలో వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధి సహకరించాలని కోరారు.