KKD: టీడీపీ అత్యున్నత విభాగమైన పొలిట్ బ్యూరోలో ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలను అధిష్ఠానం సభ్యులుగా నియమించింది. యనమల పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతుండగా, నెహ్రూ మధ్యలో పార్టీ మారినా ఆయన సీనియారిటీని గుర్తించి ఈ గౌరవం కల్పించారు