E.G: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీరాముని దేవాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సందర్శించారు. శుక్రవారం నిర్వహించిన స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను వీక్షించి, ప్రత్యేక పూజల్లో ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.