KRNL: వెల్దుర్తిలో నూతన సొసైటీ కాంప్లెక్స్‌ను ఇవాళ ప్రారంభించనున్నట్లు సింగిల్ విండో ఛైర్మన్ బొమ్మన రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యాంబాబు హాజరై కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.