విశాఖ నగరానికి నీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్ను కాపాడాలని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కి వినతిపత్రం అందించారు. 836.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మానాలను అమలు చేసి కబ్జాలు తొలగించాలని కోరారు.