NLR: పొదలకూరు మండలం నావూరు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీని ఎన్టీఆర్ ఏర్పటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోజరతయ్య, కూనం మస్తాన్, ఐటిడిపి నేత కాకర్ల భాను చౌదరి, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.