W.G: నరసాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి రూ.4,620 నగదు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యాలరావు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.