కడప నగరంలోని పాత మార్కెట్ ప్రాంతంలో శనివారం మేయర్ సురేష్ కుమార్ పర్యటించి, సంక్రాంతి దృష్ట్యా మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రి 7 నుండి 11 గంటల వరకు ప్రత్యేక నైట్ షిఫ్ట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కొత్త కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు.