KKD: కోటనందూరు(M) ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO వెంకటనారాయణ తెలిపారు. పరిషత్ అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సమావేశంలో (M) స్థాయి అధికారులు, MPTC సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు పాల్గొంటారు. అభివృద్ధి, గ్రామాల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించనున్నారు.