KRNL: హొళగుంద మండలం హెబ్బటంలో ఇవాళ నిర్వహించనున్న కనక శ్రీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆలూరు MLA విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారని వైసీపీ మండల కన్వీనర్ షఫీ తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.