ATP: అనంతపురం కలెక్టరేట్లో ఇవాళ జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోల చలివేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.