ATP: అనంతపురంలోని TDP కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి నేతృత్వంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని నాగరాజు పిలుపునిచ్చారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం హనుమంతరాయ చౌదరి మృతికి సంతాపం తెలిపారు.