ఏలూరు: 49వ డివిజన్ యాదవ నగరంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న CC రోడ్ల పనులను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచిస్తూ.. స్థానికుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు, రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.