కృష్ణా: కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల భారతి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి దగ్గర బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆమె తల్లి కోట చంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేయగా, భారతి బాత్రూంలో విద్యుత్ షాక్ తగలడం వలన మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.