ELR: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మణింద్రరావు అన్నారు. ఇవాళ కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో NSS పీవో వద్దాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.