కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఇవాళ 134 మంది పోలీసులకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు పూర్తి చేసిన సిబ్బందికి నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టారు. ఖాళీల ఆధారంగా ఇతర స్టేషన్లు ఎంచుకోవాలని, విధుల్లో బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు జరగడంతో పోలీసు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.