KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేట గ్రామంలో రూ.55.23 లక్షల వ్యయంతో పశుసంవర్ధక ఉపకేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో ఈ కేంద్రం మంజూరైనట్లు స్థానిక నాయకులు తెలిపారు. కేంద్రం ద్వారా పశుపోషకులకు టీకాలు, చికిత్స వంటి సేవలు సమీపంలోనే అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు.