HNK: బాలసముద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు JEE ఫలితాల్లో సత్తా చాటారు. శిక్షణ పొందిన 27 మంది విద్యార్థుల్లో 17 మంది JEE అడ్వాన్స్‌కు అర్హత సాధించగా, పలువురు NITలో సీట్లు ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వ ఉచిత కోచింగ్ కార్యక్రమం గ్రామీణ గిరిజన విద్యార్థుల కలలను నిజం చేస్తోందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.