KRNL: ధర్మానికి శ్రీరాముడు ఆదర్శంగా నిలిచి, సత్యం, న్యాయం, నీతి మార్గాలను సమాజానికి చూపించిన ఆయన చరితం నేటి సమాజానికీ మార్గదర్శకంగా నిలుస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పాతబస్తీ తెలుగు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన శోభాయాత్రను కమిషనర్ ప్రారంభించారు.