CTR: కుప్పం మండలం కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత(40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి మండలం శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారీ కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు.