E.G: ఆధార్ నవీకరణ కోసం మండపేట పట్టణంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ TV రంగారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆదేశాల మేరకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 9 నుంచి 13 వరకూ మరలా 23 నుంచి 26 వరకూ ఈ క్యాంపులు కొనసాగుతాయన్నారు. 15-17 సంవత్సరముల మధ్య వయసు గల వారు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నారు.