సత్యసాయి: జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులకు పది రోజులు దాటినా డెలివరీ ఇవ్వకుండా, హోటళ్లకు అధిక ధరతో విక్రయిస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు పెంచి సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పాటించాలని ప్రజలు కోరుతున్నారు.