కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 271 మందిపై కేసులు నమోదు చేసి, రూ.57,450 జరిమానా విధించారు. కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.