KRNL: కర్నూలు నగరంలోని నందికోట్కూరు రోడ్డులో విద్యుత్ లైన్ల ఆధునికీకరణ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ డివిజన్ ఈఈ వి.రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. జయరాం నగర్, చెక్‌పోస్టు, వాసవీ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.