KDP: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గస్తీ విధులు నిర్వహిస్తూ లాక్డ్ హౌస్లు, లాడ్జీలు, దేవాలయాలు, ఎటీఎంల వద్ద ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తూ అక్రమ కార్యకలాపాలపై కట్టడి చేస్తున్నారు.