కృష్ణా: మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలులో పాత ఇనుప విద్యుత్ స్థంభాలు ఎక్కడివి అక్కడే వంచి వదిలేశారు. ప్రధాన రహదారి పక్కన నూతన సిమెంట్ స్థంభాలు వేయించిన విద్యుత్ శాఖ అధికారులు పాత ఇనుప స్థంభాలు తొలగించలేదు. దీంతో రోడ్డు పక్కన ఇనుప స్థంభాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత స్థంభాలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.