VZM: జిల్లాలో సివిల్ విభాగంలో 21 మంది పోలీసు సిబ్బందికి ASIలు,హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ ఉత్తర్వులు అందజేసి సిబ్బందికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు పొందిన సిబ్బంది మరింత బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.