BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు పోలీసులు జూద స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.6,060 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడుతుంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.