NZB: ధర్పల్లి మండలం రేకులపల్లిలో హెచ్ఎం అంకం నరేశ్ ఆధ్వర్యంలో శనివారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వం విద్యను అందిస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యా అందుతుందన్నారు.