ADB: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్కెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు. మార్కెట్ యార్డ్‌కు వచ్చిన రైతులకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.