VSP: పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని జిల్లా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఇవాళ గ్రీన్ పార్క్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యతో అసమానతలు తొలగుతాయని విశ్వసించిన దూరదృష్టి గల నాయకుడని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.