అన్నమయ్య: పాత రాయచోటిలో పోలేరమ్మ దేవర మహోత్సవం సందర్భంగా ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అగ్గిపెట్టె విషయంలో ఆర్కే శ్రీను, రెడ్డిసాయి(20) మధ్య వాగ్వాదం జరగగా, ఆగ్రహించిన శ్రీను కత్తితో రెడ్డిసాయిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రెడ్డిసాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం ఆదివారం మెరుగైన చికిత్స కోసం కడపకు పంపించారు.