NLR: దుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మొక్కల పెరుగుదలకు పూర్వ విద్యార్థి పెసల కృష్ణ 120 కిలోల సేంద్రీయ ఎరువును అందజేశారు. HM కె.రమణమ్మతో కలిసి మొక్కలకు ఎరువు వేశారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.