TPT: నాగలాపురం రెడ్డి వీధిలోని శ్రీ కావమ్మ సమేత మారయ్య దేవాలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరునాళ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సోమవారం ఎస్సై సునీల్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. 29న జరిగే కావమ్మ తల్లి ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు కల్పించాలని వారు కోరారు.