GNTR: మంగళగిరిలో కనిగిరికి చెందిన బోయవాల్మీకులు గురువారం నిరసన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్షకు దిగారు. కనిగిరిలోని ఐదెకరాల స్మశాన స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. అడ్డుకున్న 45 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఎం, పవన్, లోకేశ్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.