VSP: గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముగింపు దశలో ఉంది. ప్రస్తుత 98 వార్డులను 120కి పెంచే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రతి వార్డులో 14,500–17,000 జనాభా ఉండేలా సరిహద్దులు ఖరారు చేశారు. జోన్ల వారీగా భీమిలి 5, మధురవాడ 7, ఈస్ట్ 18, నార్త్ 20, సౌత్ 16, వెస్ట్ 17, పెందుర్తి 7, గాజువాక 19, అగనంపూడి 5, అనకాపల్లి 6 వార్డులు ప్రతిపాదించారు.