అనకాపల్లి: కోటవురట్ల మండలం బోడపాలెం-కొత్తూరు గ్రామంలో శనివారం ఉపాధి పనుల్లో పాల్గొన్న కార్మికరాలు మృతి చెందింది. చెరువు పనుల్లో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వచ్చిన లోకవరపు చింతపల్లి(60) చెరువు పని చేస్తుండగా ఆకస్మికంగా కుప్పకూలిపోయి మృతి చెందింది. ఆమె మృతితో కూలీల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.