VZM: ఎల్.కోట నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామనిఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు గురువారం లక్కవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో ‘జలధార-జలహారతి’ పథకంపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జలధార-జలహారతి’ పనులలో నాణ్యతతో పాటు, పనులలో వేగం కూడా ముఖ్యమన్నారు.